ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి నో శివసేన యస్
మహారాష్ట్ర లో ప్రభుత్వన్ని ఏర్పాటు చెయ్యలాని భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలిని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శనివారం నాడు ఆహ్వానించాగా ఆదివారం నాడు ఏర్పాటు చెయ్యలేమని గవర్నర్ కు సమాచారం అందించాటంతో రెండవ పెద్ద పార్టీ ఆయన శివసేన పిలిచి రేపు సోమవారం సాయంత్రం లోపల మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో లేదో తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనకు సూచించారు.
అంతకు ముందు గవర్నర్‌ను కలిసిన ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ లు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తమకు సంఖ్యాబలం లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. దానితో గవర్నర్ ప్రత్యామ్నాయంగా రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ఆహ్వానం పంపించారు
తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ – శివసేన కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం 149 రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అయితే ఎన్నికలకు ముందు అమిత్ షా ఇచ్చిన హామీ మేరకు తమకు రెండున్నరేళ్ల సీఎం పదవి కావాలని శివసేన పట్టుబట్టింది. అయితే తము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను శివసేన ప్రయత్నిస్తోంది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్ సి పి 54 సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి 44 మంది గెలుపొందారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉందికానీ, శరద్ పవార్‌తో శివసేన పలు దఫాలుగా చర్చలు జరిపారు ఎన్సీపీ నాయకుడు పటేల్ మాట్లాడుతూ ఎన్డీఏ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వస్తే మద్దతు ఇచ్చే అంశం పరిశీలన చేస్తామని తెలిపారు.
ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయం మరిన్ని మలుపులు తిరుగుతుందో వెచిచూడవలసిందే