రైల్వే రాయితీ డీజిల్ పేరుతో ఘరానా మోసం
రైల్వే ఉద్యోగినంటూ నమ్మబలికి రైతులకు రాయితీ డీజల్ కొట్టిస్తానంటూ ఓ వ్యక్తి వారి వద్ద నుండి 43వేల 200వందల రూపాయలు మోసం చేసి పరారైన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక దరిశి రోడ్డు ఈఎస్ఎస్ఏఆర్ పెట్రోల్ బంకు వద్ద గురుగుపాడు గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు 60రూపాయలకే డీజల్ కొట్టిస్తానంటూ నమ్మబలికి ఒక గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి పెట్రోల్ బంకులో 720లీటర్లు డీజిల్ కొట్టించుకుని లీటర్ 60 రూపాయల చొప్పున 43, 200వందల రూపాయల నగదు ఆ వ్యక్తికి ఇవ్వగా అవి తీసుకుని పెట్రోల్ బంకు నుండి ఉడాయించాడు.
ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి సిసిటివి పూటేజ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై గురుగుపాడు గ్రామ రైతులు పొదిలి టైమ్స్ తో మాట్లడుతూ మా గ్రామానికి ఒక వ్యక్తి వచ్చి నేను రైల్వే ఉద్యోగిని ఇక్కడ రైల్వే లైన్ పనులు చేయిస్తున్నానని చెప్పి….. రైల్వే పనుల నిమిత్తం మాకు రాయితీతో డీజిల్ తక్కువ రేటు వస్తుంది మాకు ప్రతి నెల ఒక వెయ్యి లీటర్లు డీజిల్ మిగులుతుంది కాబట్టి మీకు లీటరు 60రూపాయలకే ఇస్తానని చెప్పడంతో 10తక్కువ ధరకే డీజల్ లభిస్తుందని భావించిన గ్రామ రైతులు వచ్చి 720లీటర్లు డీజల్ కొట్టించుకున్న తరవాత మా దగ్గర నగదు తీసుకుని ఇప్పుడే వస్తానని నమ్మబలికి మమ్మల్ని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.