స్మశాన కబ్జాకు యత్నించిన వైసీపీ నాయకులను అడ్డుకున్న జనసైనికుడిపై దాడి
స్మశానాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వైసీపీ నాయకులను అడ్డుకున్న జనసేన నాయకుడిపై దాడి చేసిన సంఘటన శనివారంనాడు ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న విశ్వబ్రాహ్మణ స్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు వారి అనుచరులతో కలిసి జేసిబి, ట్రాక్టర్లతో పనులు జరిపిస్తుండగా….
జనసేన నాయకుడు పేరుస్వాముల శ్రీనివాసులు అడ్డుకోవడంతో అతనిపై దాడి చేసి అక్కడినుండి నెట్టివేశారు.
ఈ విషయమై పొదిలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన పొదిలి టైమ్స్ కు తెలిపారు….. ఈ ఘటనపై జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ రాష్ట్ర పార్టీ కార్యాలయం ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని…. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.