వివాదాస్పద స్మశానభూమిలో హెచ్చరిక నామ పలకను పెట్టిన రెవెన్యూ సిబ్బంది
వివాదాస్పద స్మశానభూమిలో తహశీల్దార్ ప్రభాకరావు ఆదేశాలు మేరకు రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక నామ పలకను పెట్టి సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక శివాలయం ఎదురు స్మశానం భూమి నందు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు ఇది ప్రభుత్వానికి చెందిన శ్మశానం స్థలం అయిఉన్నది….. దీనిలోకి అక్రమంగా ప్రవేశించుట నేరము చట్ట విరుద్ధంగా అట్లు ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును అని నామ పలకను అక్కడ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు వెలుగొండయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.