దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలి : న్యాయమూర్తి రాఘవేంద్ర
దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని న్యాయమూర్తి రాఘవేంద్ర అన్నారు.
వివరాల్లోకి వెళితే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక న్యాయస్థానంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి రాఘవేంద్ర మాట్లాడుతూ అన్ని అవకాశాలు సౌకర్యాలు ఉన్న వ్యక్తి సాధించేది విజయం అయితే ప్రత్యేక పరిస్థితిలను ఎదుర్కొంటూ అవరోధాలను అసౌకర్యాలను సోపానాలుగా చేసుకుని సాధించే విజయం చరిత్రగా నిలుస్తుందని….. అదేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించి వారి లోపాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా దివ్యాంగులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.