దిశ హత్యను నిరసిస్తూ భారీ ర్యాలీ మానవహారం
దిశ హత్యను నిరసిస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ మానవహారం నిర్మాణం కార్యక్రమం నిర్వహణ బుధవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో దిశ హత్యాచారం హత్యకు గురి కావడంపై నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం నాడు వీరిశెట్టి విద్యాసంస్థల విద్యార్థుల ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథపురం నుండి పెద్దబస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు భారీ ప్రదర్శన నిర్వహించి మానవహారం నిర్మించారు.
ఈ కార్యక్రమంలో వీరిశెట్టి విద్యాసంస్థల విద్యార్థులు మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.