మానవ హక్కుల ఉల్లంఘన నేరం : రాఘవేంద్ర
రాజ్యాంగ కల్పించిన మానవహక్కలను ఉల్లంఘించుట చట్ట రీత్యా నేరమని స్థానిక న్యాయస్థానం న్యాయమూర్తి యస్ సి రాఘవేంద్ర అన్నారు. వివరాలు లోకి వెళితే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా నివసించుటకు భారత రాజ్యంగం కల్పించిన మానవ హక్కులు ప్రధాన కారణం అని ప్రతి వ్యక్తి తన హక్కులను కాపాడుకుంటూనే ఇతరుల హక్కులను భంగం కలిగించకూడదని అలా చెయ్యడం నేరం అవుతుందిని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్నాసి రామరావు న్యాయవాదులు జె వి సుబ్బారావు , ముల్లా ఖాదర్ వలి, జ్ఞాన కుమారి , రాఘరావు తదితరులు పాల్గొన్నారు