ఘోర రోడ్డుప్రమాదం నాలుగురు మృతి మరో నాలుగురు పరిస్థితి విషమం
ఘోర రోడ్డుప్రమాదం సంభవించి నాలుగురు అక్కడికి అక్కడే మృతి మరో నాలుగురు పరిస్థితి విషమం మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.
వివరాలు లోకి వెళ్లితే చనిపోయిన తన బంధువును చూడటానికి తూఫాన్ వాహనం నందు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుండి ఒంగోలుకు వస్తుండగా కొనకనమీట్ల మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో సిద్దంపల్లి ఇమంత్ రెడ్డి , ఉద్దట్టి హంసమ్మ ,బళ్లారి సునీత,చౌటపల్లి సుగుణమ్మ లు అక్కడికి అక్కడే మృతి చెందాగ ఉద్దట్టి శృతి , ఉద్దట్టి వీరారెడ్డి , సిద్దంపల్లి సురేష్ రెడ్డి, సిద్దంపల్లి అమర్ రెడ్డి , సిద్దంపల్లి రామిరెడ్డి, డ్రైవర్ మంజు లకు తీవ్రంగా గాయపడటంతో ఒంగోలుకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు