ఘనంగా బాలినేని జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు సుబ్బానచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివరాలు లోకి వెళ్ళితే గురువారం నాడు స్థానిక విశ్వనాథపురం నందు ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ను వైసిపి న్యాయ విభాగం అధ్యక్షులు దర్నాసి రాము కోసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలం కోఅప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వారి , మాజీ ఎంపిటిసి సభ్యులు షేక్ ఖాదర్ భాషా వైసిపి నాయకులు బాలినేని అభిమానులు సుబ్బారెడ్డి , బాపుజీ రెడ్డి ,వరప్రసాద్, అబ్బుల్ కలాం , షేక్ మహుబుబ్ వారి తదితరులు పాల్గొన్నారు