పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు భారీ రహదారి ప్రదర్శన
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు భారీ రహదారి ప్రదర్శన నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం జమియత్ ఉలేమా ఇ హింద్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథపురం సెంటర్ నుండి పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ , మీదుగా తహశీల్దారు కార్యాలయం వరకు భారీ రహదారి ప్రదర్శన నిర్వహించి….. అనంతరం ఉప తహశీల్దారు రఫీకి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం వలన మరియు జాతీయ పౌర పుస్తకం వలన ముస్లింలు హక్కులను కాలరాస్తున్నారని కాబట్టి తక్షణమే వాటిని అమలు నిలిపివేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మౌలానా రబ్బానీ సాబ్, మౌలానా ఇస్మాయిల్ సాబ్, మౌలానా రఫీ సాబ్, ముఫ్తి హిదాయతుల్లా, హఫిజ్ అబ్దుల్ రహిమాన్, మౌలానా హర్షద్, మతపెద్దలు మరియు ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.