పంచాయతీ ఒప్పంద కార్మికుల ధర్నా
పంచాయతీ ఒప్పంద కార్మికులు ధర్నా కార్యక్రమం శుక్రవారంనాడు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక పంచాయతీ కార్యాలయం మరియు మండలం పరిషత్ కార్యాలయాల ఎదుట శుక్రవారంనాడు పంచాయతీ ఒప్పంద కార్మికులు తమకు రావలసిన వేతన బకాయిలను చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన సందర్భంగా…… కార్మికులు మాట్లాడుతూ వేతన బకాయిలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి తమకు పెండింగులో ఉన్న జీతాలను చెల్లించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.