గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం నాడు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వాలంటీర్లు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు.

అనంతరం వాలంటీర్లు శాసనసభ్యులు కుందూరును ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, మండల రెవెన్యూ తహశీల్థార్ ప్రభాకరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు, వైసిపి నాయకులు జి శ్రీనివాసులు, షేక్ నుర్జహన్, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మరియు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.