బిజేపికి చేజారిన ఝార్ఖండ్…. జిఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కైవసం
భారతీయ జనతాపార్టీ చేతులనుండి ఝార్ఖండ్ రాష్ట్రం చేజారి ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే 81శాసనసభ స్థానాలు కల్గిన ఝార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరగగా….. అధికార భారతీయ జనతాపార్టీ మొత్తం
అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కాగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటి చేశాయి.
బిజేపి మిత్రపక్షాలైన అఖిల ఝార్ఖండ్ విద్యార్థి సంఘం పార్టీ, ఝార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీలు స్వంతంగా అన్ని స్థానాల్లో పోటి చేయగా మరికొన్ని స్థానాల్లో వామపక్షాలు వివిధ పార్టీలు పోటీ చేయడంతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బహుముఖ పోటీ జరిగింది.
ఝార్ఖండ్ మొత్తం స్థానాలు: 81 కాగా….. అవసరమైన మెజారిటీ:41
ఝార్ఖండ్ ముక్తి మోర్చా-30……. కాంగ్రెస్ పార్టీ-16…….. రాష్ట్రీయ జనతాదళ్-01……… నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-01
కూటమి మొత్తం గెలిచిన స్థానాలు 48
భారతీయ జనతాపార్టీ-25…… ఝార్ఖండ్ వికాస్ మోర్చా-03
అఖిల ఝార్ఖండ్ విద్యార్థి సంఘం పార్టీ-02…….. స్వతంత్రులు-02……. సిపిఐ(ఎంఎల్)-01
పార్టీల వారిగా ఓట్లు శాతం
జెఎంఎం -18.8…….కాంగ్రెస్-13.8…… ఆర్జేడీ-2.7…… ఎన్సీపి-0.42
కూటమి ఓట్లు శాతం 35.88
భారతీయ జనతాపార్టీ 33.4 శాతం
ఝార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు శాతంలో తేడా 2.4 శాతం
బిజేపి మిత్రపక్షాలైన అఖిల ఝార్ఖండ్ విద్యార్థి సంఘం పార్టీకి 8శాతం….. ఝార్ఖండ్ వికాస్ మోర్చా కు5.45 శాతం…. ఓట్లు సాధించగా మొత్తం బిజేపి మిత్రపక్షాలకు 13.45శాతం ఓట్లు సాధించగా బిజేపి అధికారాన్ని 2.4 శాతం ఓట్లతో చేజార్చుకుంది.
మిత్రపక్షాలతో పొత్తు లేకపోవడంతో భారతీయ జనతాపార్టీ అధికారం నుంచి దిగిపోయేలా చేసింది.