పొదిలికి చెందిన తిరుపతి వెంకటేశ్వర పశు వైద్యశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల నందు డైరీ టెక్నాలజీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న పొదిలి పట్టణంలోని విశ్వనాథపురానికి చెందిన మతుకుమల్లి విష్ణు (23)తన రూములో ఉరివేసుకుని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయాన్ని కాలేజి యాజమాన్యం మరియు పోలీసులు తెలుసుకున్న పొదిలి పట్టణంలోని బంధువులు, స్నేహితులు విష్ణు ఇంటివద్దకు చేరుకుని
శోకసంద్రంలో మునిగిపోయారు.