తువ్వపాడు లో సామూహిక శ్రీమంతాలు ముఖ్య అతిథి గా హాజరైన కందుల

కొనకనమీట్ల మండలం తువ్వపాడు గ్రామంలో గ్రామ అంగనవాడి కేంద్ర ఆద్వర్యం లో సామూహిక శ్రీమంతాలు కార్యక్రమంకు ముఖ్య అతిథి మార్కపురం తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం మహిళలు కు ఆస్తి హక్కు రిజర్వేషన్లు కల్పించిదిని అన్నారు . మహిళ అబివృద్ది కి తెలుగు దేశం ప్రభుత్వం కట్టుబడిఉందిని అయినా అన్నారు. ఈ కార్యక్రమంలో కొనకనమీట్ల మండల తెలుగు దేశం నాయకులు తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాజీ జడ్పీటిసి సభ్యులు జైదేవ్ కమార్ మరియు పొదిలి మండల తెలుగు యువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ యువ నాయకులు సుకదేవ్ తదితరులు పాల్గొన్నారు . అనంతరం పొదిలి మండల తెలుగు యువత అధ్యక్షులు ఉదయ్ తో కందుల ప్రత్యేకంగా చర్చలు జరిపారు