తహశీల్దార్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్ళితే మంగళవారంనాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ఆవరణలో సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రత్యేక సెమీ క్రిస్మస్ కేకును తహశీల్దారు ప్రభాకరరావు కోసి సిబ్బందికి పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఉప తహశీల్దారు రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, మండల రెవెన్యూ కార్యాలయాల సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.