సార్వత్రిక సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ
సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడపత్రికను బుధవారం నాడు స్థానిక శివాలయం సమీపంలోని నీటి సరఫరా కేంద్రం వద్ద ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ సార్వత్రిక సమ్మె పిలుపును ఇవ్వడంతో సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించి సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మార్కాపురం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ అందె నాసరయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి టివి చౌదరి, సిపిఐ పట్టణ కార్యదర్శి కెవి రత్నం, తదితరులు పాల్గొన్నారు.