ఆపరేషన్ ముస్కాన్ లో 9 మంది బాలకార్మికులను గుర్తించిన పోలీసులు

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆదేశాలతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించిన పోలీసులు పలుచోట్ల పనిచేస్తున్న 9మంది బాలకార్మికులను గుర్తించి పోలీసు స్టేషన్ కు తరలించారు.

అనంతరం పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ సమక్షంలో పిల్లలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి బాలకార్మిక చట్టం గురించి వివరించి పిల్లలను బడికి కాకుండా పనులకు పంపడం చట్టరీత్యా నేరమని కౌన్సెలింగ్ అందించి…… పిల్లలను బడికి పంపే ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ సురేష్, మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.