ఘనంగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు
లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత దివ్యాంగుల పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆఖిబ్ అహమ్మద్, అరిఫ్ అహమ్మద్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్ పద్మావతి హాజరైన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల ఆశాదీపమని……. లోపం శాపం కాకూడదని ప్రత్యేకంగా లిపిని తయారుచేసి అంధులకు విద్యను అందించే విధంగా తయారుచేసి అంధులపాలిట ఆరాధ్యదైవంగా నిలిచిపోయారని కొనియాడారు.
అలాగే లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిత పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, షాహిదాబేగం, కిరణ్మయి, నారాయణమ్మ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.