క్షేత్రస్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్
క్షేత్రస్థాయి నుండి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక సాయి కల్యాణమండపంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ…… ఈనెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.
మొత్తంగా జిల్లాలో 3, 57,464మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని…. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 10,899 బృందాలను ఏర్పాటు చేశామని…… సమాజంలో నుంచి పోలియోను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
పల్స్ పోలియో నిర్మూలించడానికి క్షేత్రస్థాయి నుండి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని…… మండల స్థాయిలో విధిగా సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సచివాలయాలు ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.
మారుమూల ప్రాంతాల్లో సైతం పల్స్ పోలియో చుక్కల మందు చిన్నారులకు వేయించేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని……. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయాలని లేకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
జిల్లాలో 2,502ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ జరుగుతుందని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేసి….. ఇప్పటికే 125 కేంద్రాల్లో 5 లక్షల యూనిట్ల చుక్కల మందు నిలువ చేశామని తెలిపారు. 18వ తేదీన అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టి….. 10నుండి 14వతేదీ వరకు మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అలాగే 14నుండి 16వ తేదీ వరకు చుక్కల మందు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టు కే నరేంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ పద్మజ, డిఆర్డిఎ పిడి ఎలీషా, రిమ్స్ సూపర్డెంట్ శ్రీ రాములు, ఒంగోలు, కందుకూరు ఆర్ డి వో లు ప్రభాకర్ రెడ్డి, ఓబులేసు ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.