జనవరి 8న దేశవ్యాప్తసమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల బైకు ర్యాలీ

జనవరి 8న దేశవ్యాప్తసమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే జనవరి 8న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రికసమ్మె మరియు రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని సిఐటియు, యుటియఫ్,ఎఐటియుసిల ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసువద్ద మోటార్ బైక్ ర్యాలీని సిఐటియు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ హానీఫ్ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఈ ర్యాలీ చిన్నబస్టాండ్, పెద్దబస్టాండ్, విశ్వనాధపురం వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా హానీఫ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ముకాస్థూ కార్మికహక్కులను కాలరాస్తుందని……ప్రభుత్వరంగసంస్థలైన రైల్వే, బియస్ యన్ యల్, ఉక్కు, ఎయిర్ లైన్స్, యల్ఐసి, ఒయన్జిసి వంటి సంస్థలను కారుచౌకగా బడాపెట్టుబడిదారులకు కట్టబెడుతుందన్నారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేక అప్పులలో కూరుకుపోయారని….స్వామినాధన్ కమీషన్ సిఫారసులను లనుఅమలుచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

యుటియఫ్ రాష్ట్రకమిటి సభ్యులు రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సిపియస్ ను రద్దుచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని….. కనీసవేతనాలను కూడా అమలుచేయడంలేదని…… కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చేసే పనికి తగిన వేతనం అమలుచేయాలని అన్నారు.

సిఐటియు పశ్చిమప్రకాశంజిల్లా ప్రదానకార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెన్ఫట్స్ కల్పించాలని, అసంఘటితరంగ కార్మికులకు పియఫ్ గ్రాట్యుటి, పెన్షన్ తో కూడిన సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని జనవరి 8న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, రాష్ట్రబంద్ ను జయప్రదంచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యుటియఫ్ జిల్లాకార్యదర్శి షేక్ అబ్దుల్, యుటియఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటి మెంబర్ వి యస్ కె రాజేశ్వరావు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండల అధ్యక్ష కార్యదర్శులు డి బాలకాశిరెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు, గోనే శ్రీనివాసులు, వి వెంకటేశ్వరెడ్డి, సిహెచ్ లింగయ్య‌‌, సిఐటియు అధ్యక్షులు వి ప్రభుదాస్, నాయకులు జి.నాగులు, కెవి నరసింహం, జి సుబ్బయ్య, జియంపియస్ జిల్లాకార్యదర్శి టి తిరుపతిరావు, ఎఐటియుసి పొదిలి మండల కార్యదర్శి కెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.