ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిఐ వెంకట్రావు
బహిరంగ మద్యపానం నిషేధం నేపథ్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సిఐ వెంకట్రావు శనివారంనాడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే బహిరంగ ప్రదేశాలు, దుకాణాలు మరియు రెస్టారెంట్లలో మద్యం సేవించడం మరియు అనుమతించడం నిషేధంపై ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తన సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మద్యపానం నిషేధం నేపథ్యంలో తనిఖీలు చేపట్టడం జరిగిందని…. దుకాణాలు, రెస్టారెంట్లు వంటి వాటిల్లో మద్యం అనుమతిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని…. అలాగే బహిరంగంగా మద్యం సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.