హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
హెల్పింగ్ ఫ్రెండ్స్ పొదిలి వారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారంనాడు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్వామి వివేకానంద జన్మదినం మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్టాండ్ నందు హెల్పింగ్ ఫ్రెండ్స్ సంస్థ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము స్వామి వివేకానంద స్పూర్తితో హెల్పింగ్ ఫ్రెండ్స్ పొదిలి పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని……. భవిష్యత్తులో తాము ఇతర మిత్రులను కలుపుకుని మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుప్పం సుమన్, గండురు బ్రహ్మ నాయుడు, గుడూరి స్వర్ణ కుమార్, చీమలమర్రి రవి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు