మండలంలోని తలమళ్ల గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే గత పదిరోజులుగా తలమళ్ల గ్రామంలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకుని తీవ్ర ఘర్షణకు దారితీయడంతో బ్రహ్మయ్య, రత్తయ్య, బ్రహ్మయ్య, దయ, అనే నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.