శివాలయం దేవస్థానము పాలకవర్గం ప్రమాణస్వీకారం

పార్వతీ సమేతనిర్మమహేశ్వరస్వామి దేవస్థానము నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది.వివరాలోకి వెళ్ళితే స్థానిక శివాలయం దేవస్థానము నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ అధ్యక్షతన 8 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అతిథిగా శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, వైసిపి నాయకులు జి శ్రీనివాసులు , సాయి రాజేశ్వరరావు, నరసింహారావు, వాకా వెంకటరెడ్డి,కళ్ళం వెంకట సుబ్బారెడ్డి, పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ ,గొలమారి చెన్నారెడ్డి,ఉలవ గోపి,మెట్టు వెంకట రెడ్డి జిసి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు