అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు

అభివృద్ధి పనులకు శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి శంకుస్థాపన చేశారు.వివరాల్లోకి వెళ్ళితే శుక్రవారం నాడు స్థానిక కంభాలపాడు గ్రామ పంచాయితీ పరిధిలోని సాయి బాలాజీ నగర్ నందు పలురకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెంట మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు, మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ రాజ్ ఏఇ మస్తాన్ వలి , పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి వైసిపి నాయకులు బోనం వెంకటేశ్వర రెడ్డి, సూర్యనారాయణ యాదవ్, తిరుపతిరావు, తలుపులు మాధవరావు,పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు