పల్స్ పోలియో విజయవంతం చేయాలని భారీ ర్యాలీ
పల్స్ పోలియో విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.వివరాలోకి వెళ్ళితే స్థానిక ప్రభుత్వ వైద్య శాల నుంచి పెద్ద బస్టాండ్ మీదుగా చిన్న బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ పోలియో రహిత దేశంగా భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందిని ఆ గుర్తింపు పోకుండా పోలియోను నిర్మిలించుటకు ఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గ్రామ స్వచ్ఛంద కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు , ఈఓఆర్డీ రాజశేఖర్ ,పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు, వైద్య అధికారి రాధ కృష్ణ పంచాయతీ సిబ్బంది ఆశా కార్యకర్తలు, గ్రామ స్వచ్ఛంద కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు