ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివరాలు లోకి వెళ్ళితే స్థానిక పెద్ద బస్టాండ్ నందు స్వర్గీయ నందమూరి తారకరామారావు
24వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలను మండల తెలుగు దేశం పార్టీ నాయకులు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడినా మహానేత అని సామాజిక న్యాయం, సామాజిక మార్పుకోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్ , సమాంతపూడి నాగేశ్వరరావు , యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాటూరి నారాయణ బాబు, భూమా సుబ్బాయ్య , బత్తిన ఓబయ్యయాదవ్,కల్లూరి సోమయ్య , వెంకట్రావు , షేక్ రసూల్ ,షేక్ జిలానీ, ముని శ్రీనివాస్, మహిళా నాయకురాలు షేక్ షాన్ష్వాజ్ తదితరులు పాల్గొన్నారు