పెద్ద చెరువు అలుగు ఆక్రమణలను పరిశీలించినా ఆర్డీవో నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ

పొదిలి పట్టణంలోని పెద్ద చెరువు అలుగు వాగు పోరంబోకు భూమిలో గత ఆరు నెలలుగా జరిగిన ఆక్రమ కట్టడాలును శనివారం నాడు కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఓబులేసు పరిశీలించి తక్షణమే నోటీసులు జారీ ఆక్రమ కట్టడాలును తొలిగించాలని తహశీల్దార్
ప్రభాకరరావుకు ఆదేశాలు జారీచేశారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, సహాయ సర్వేయర్ రమేష్ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు