వాసవీ క్లబ్ లు సామాజిక దృక్పధంతో పని చేయాలి: ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్

వాసవీ క్లబ్లు సామాజిక దృక్పథంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. వివరాలు లోకి వెళ్ళితే స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు విజన్ 2020 క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం రీజన్ చైర్మన్ మేడా నర్సింహారావు అధ్యక్షతన జరిగింది.
                                                  ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పంప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యలు పేదల అభివృద్ధికి వారి సంక్షేమం కోసం మరియు సామాజిక మార్పుకోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురె ఉమాదేవి ,207 జిల్లా గవర్నర్ మగులూరి రామ సుధాకర్ లు క్2020 క్లబ్ అధ్యక్షులు మేడ అనంత శ్రీనివాసులు, కార్యదర్శి కల్వ వెంకట సుదీర్, కోశాధికారి బండారు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కొత్తూరి రవికుమార్ , ఉపాధ్యక్షులు తాతా రాములు చేత ప్రమాణస్వీకారం చేయించారు.
                                                        అనంతరం ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా నాయకులు కందగుడ్ల వెంకటరమణ,వెలుగురి చంద్ర, సోమిశెట్టి శ్రీదేవి,సోమిశెట్టి చిరంజీవి ,రావూరి సుబ్బారాయుడు,పమిడిమర్రి కృష్ణమూర్తి,యాదాల సుబ్బారావు,పందిటి సునీల్,రావూరి ప్రసాద్,మునగసత్యం,జి.యస్.ఆర్,మామిడి వెంకటేశ్వర్లు, సాధు ప్రవీణ్,పమిడిమర్రి మల్లికార్జున్, తాతా హరిత,ఒగ్గు వెంకట్రామయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు పందిటి మురళి,జి.సి సుబ్బారావు,శివాలయం
దేవస్థానం చైర్మన్ కంకణాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.