పౌరసత్వ సవరణ చట్టంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలుచేస్తూ దాఖలైన 140పిటిషన్లుకు సంబంధించి బుధవారంనాడు సుప్రీంకోర్టు విచారించనుంది.
వివరాల్లోకి వెళితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు యస్ అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నాల ధర్మసనం ఈ సమస్యకు సంబంధించి దేశంలోని అన్ని హైకోర్టుల ముందు పెండింగులో ఉన్న అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యలను కలిపి బుధవారంనాడు విచారించనుంది.