ఆస్తి పంపకాల విషయంలో గొడవ… ఒకరికి గాయాలు

పట్టణంలోని స్థానిక చిన్నబస్టాండు భారత్ పెట్రోలు బంకు పక్కనే నివాసం ఉంటున్న మాకినేని నరసింహం అనే వ్యక్తి ఇంటికి ఆస్తి పంపకాల విషయమై వచ్చిన నలుగురు క్రాంతి, మహంతి, సూర్య, అనిల్ అనే వ్యక్తులు వచ్చి మాకినేని నరసింహం అనే వ్యక్తిని గాయపరచి ఇంట్లోని వస్తువులను చిందరవందరగా విసిరేసి భయబ్రాంతులకు గురిచేశారని నరసింహం కుమారుడు మాకినేని అమరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొదిలి ఎస్ఐ సురేష్ తెలిపారు.