మహిళా సాధికార మిత్ర సేవలను వినియోగించుకోవాలి

మహిళా సాధికార మిత్ర సేవలను వినియోగించుకోవాలని మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు కోరారు.

వివరాల్లోకి వెళితే జాతీయ బాలికల వారోత్సవాలలో భాగంగా మర్రిపూడి వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు మాట్లాడుతూ బాలికలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని….. మహిళా భద్రతకై అభయ్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆపదలో ఉన్న సమయంలో 100కు మరియు అత్యవసర సేవ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ ఇందిరా కుమారి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రం నందు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండలంలోని అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.