ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ తెలిపారు.
నిన్నటి నుండి శాసనమండలిలో హైడ్రామాలో మధ్య బుధవారంరాత్రి మండలి చైర్మన్ షరీఫ్ తనకు ఉన్న విచక్షణాఅధికారంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చైర్మన్ నిర్ణయంతో బిల్లులను సెలెక్ట్ కమిటీ పంపడంతో మూడు నెలలు పైగా పెండింగ్లో ఉండే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. చైర్మన్ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా వైకాపా సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.