ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను పొదిలిలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే నారా లోకేష్ 37వ జన్మదినం సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం లోకేష్ జన్మదిన కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సన్నెబోయిన సుబ్బారావు, ఆవులూరి యలమంద, భూమి సుబ్బయ్య, సమంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, కాటూరి సుబ్బయ్య, షేక్ రసూల్, ముల్లా ఖుద్దూస్, మీగడ ఓబులరెడ్డి, ముని శ్రీనివాస్, కఠారి భారత్ చంద్ర, షేక్ గౌస్, జ్యోతి మల్లిఖార్జునరావు, తెలుగు మహిళా నాయకురాలు షేక్ షాన్వాజ్, తదితరులు పాల్గొన్నారు.