షరీఫ్ చిత్రపటానికి తెలుగుతమ్ముళ్ల పాలాభిషేకం ‌

శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

వివరాల్లోకి వెళితే శాసనమండలి నందు ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ ‌బిల్లులను ‌సెలెక్ట్ కమిటీ పంపుతూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పెద్దబస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండలి చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన యొక్క విశేషాధికారంతో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షించారని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సన్నెబోయిన సుబ్బారావు, ఆవులూరి యలమంద, భూమి సుబ్బయ్య, సమంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, కాటూరి సుబ్బయ్య, ‌షేక్ రసూల్, ముల్లా ఖుద్దూస్, మీగడ ఓబులరెడ్డి, ముని శ్రీనివాస్, కఠారి భరత్ చంద్ర, షేక్ గౌస్, జ్యోతి మల్లిఖార్జునరావు, తెలుగు మహిళా నాయకురాలు షేక్ షాన్వాజ్, తదితరులు పాల్గొన్నారు.