రేపు తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీ పంపి నైతిక విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ తరపున శుక్రవారంనాడు స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు నుండి కాటూరివారిపాలెం వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెదేపా నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సన్నెబోయిన సుబ్బారావులు పొదిలి టైమ్స్ కు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హాజరు కానున్నారని కావున మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.