రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూడు రాజధానులు : కందుల

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూడు రాజధానులని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో అమరావతిని రక్షించాలని కోరుతూ తలపెట్టిన ద్విచక్ర వాహనల ర్యాలీ సందర్భంగా స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్ నందు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాల భూమిని పైసా ఖర్చు లేకుండా రైతులు ఇస్తే……. వారు చేసిన త్యాగానికి విలువ లేకుండా తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రైతులను తీవ్రంగా మోసంచేస్తూ పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరమీదకు తీసుకుని వచ్చి ఆగమేఘాల మీద శాసనసభలో తీర్మానం చేసారని అన్నారు.

శాసనసభలో చేసిన చట్టాన్ని శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షించారని…… సెలెక్ట్ కమిటీ పంపడంతో తుగ్లక్ ముఖ్యమంత్రి మండలినే రద్దుచేసే యోచనలో ఉన్నాడని కందుల నారాయణరెడ్డి అన్నారు.

అమరావతి రాజధానిని రక్షించేందుకు రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.