అమరావతి రక్షణకై భారీ ద్విచక్రవాహన ర్యాలీ

అమరావతి రక్షణకై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని రక్షించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు నుండి విశ్వనాథపురం, పెద్దబస్టాండు, చిన్నబస్టాండు మీదుగా కాటూరివారిపాలెం వరకు భారీ ద్విచక్రవాహనాల ర్యాలీ మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి నాయకత్వంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కనకం నరసింహారావు, మువ్వా కాటంరాజు యాదవ్, సామంతపూడి నాగేశ్వరరావు, సన్నెబోయిన సుబ్బారావు, గునుపూడి భాస్కర్, పండు అనిల్, ముల్లా ఖుద్దూస్, సయ్యద్ ఇమాంసా, ఆవులూరి యలమంద, యర్రమూడి వెంకట్రావు యాదవ్, చప్పిడి రామలింగయ్య, ఓబయ్యయాదవ్, సిపిఐ నాయకులు కె వి రత్నం, షేక్ రసూల్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పొల్లా నరసింహ యాదవ్,
మహిళా నాయకురాలు షేక్ షాన్ వాజ్ తదితరులు పాల్గొన్నారు.