మహిళ మెడలో బంగారు తాళిబొట్టు తాడు లాక్కెళ్లిన దుండగులు

మండల పరిధిలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళ మెడలోని బంగారు తాళిబొట్టు తాడు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళ గేదెల గ్రాసంకోసం పొలాల్లో గడ్డి కోస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ గేదెలు తప్పిపోయాయి అంటూ మాట్లాడుతూ అకస్మాత్తుగా మెడలోని రెండున్నర సవర తాళిబొట్టు తాడు లాగడంతో ఆమె ప్రతిఘటించగా గొలుసు లాక్కుని గాయపరచి పరారైనట్లు బాధితురాలు పొదిలి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.