ఉత్తమ బాలిక పురస్కారం అందుకున్న జ్యోష్ణ
ఉత్తమ బాలిక పురస్కారాన్ని పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ముని వెంకట జ్యోష్ణ అందుకుంది.
వివరాల్లోకి వెళితే జిల్లా స్థాయిలో ఒంగోలు భీమా భవన్ నందు జాతీయ బాలిక వారోత్సవాలలో భాగంగా వివిధ రంగాలలో ప్రావీణ్యత కలిగిన బాలికల పురస్కార కార్యక్రమంలో శనివారంనాడు పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముని వెంకట జ్యోష్ణకు ఉత్తమ బాలిక అనే అరుదైన పురస్కారం లభించింది.