యుద్ధప్రాతిపదికన నివేశన స్థలాల సేకరణ పనులు….. త్వరలోనే సాకారం కానున్న పేదల సొంతింటి కల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు పనులు వేగం అందుకున్నాయి.
వివరాల్లోకి వెళితే రానున్న ఉగాది పండుగ నాడు రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల మంది అర్హులైన పేదలకు పక్కా గృహాలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అందులో భాగంగా పొదిలి మండలంలోని దాదాపు 3వేల మంది అర్హులను ఎంపిక చేసి వారికి స్థలాలు కేటాయించే దిశగా యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామని…. ఇప్పటికే పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 1177నందు 60ఎకరాల మేర స్థలాన్ని ఎంపికచేసి తుదిమెరుగులు దిద్దే దశకు వచ్చిందని….. అర్హులకు త్వరలోనే ఇంటి స్థలాలను కేటాయించడం జరుగుతుందని….. అర్హుల జాబితాతో గ్రామసభ ఏర్పాటు చేస్తున్నామని ఆ యొక్క జాబితాలో పేరు లేకపోయినా ఇంకా అర్హులు ఎవరైనా ఉండి వారి వివరాలు నమోదు కోకపోయి ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవాలని మండల రెవిన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు తెలిపారు.