గ్రామ సచివాలయలను సందర్శించిన ఆర్డీవో

పట్టణంలోని పలు గ్రామ సచివాలయాలను మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి సందర్శించారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు పొదిలి పట్టణంలో పలు సచివాలయాలను మార్కాపురం నియోజకవర్గ ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రత్యేక అధికారి మరియు మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి సందర్శించి సచివాలయంలోని రికార్డులను, మౌలిక సదుపాయాలను పరిశీలించి సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలను అందించారు.

ఈ సందర్భంగా ఆయన పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాలను పరిశీలించి అలాగే సమస్యల గురించి తెలుసుకోవడం కోసం సచివాలయాలను సందర్శించడం జరిగిందని….. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి వీలుకల్పించడం జరిగిందని….. గ్రామ సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, రెవిన్యూ ఉద్యోగుల, గ్రామ పంచాయతీ మరియు గ్రామ సచివాలయాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.