ఇంటినివేశన స్థలాలను పరిశీలించిన ఆర్డీవో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అర్హులైన ప్రతి పేదవారికి ఉగాదిలోగా సొంతింటిని నిర్మించుకునే పనులలో భాగంగా పొదిలి పట్టణంలోని ఇంటి నివేశన స్ధలాలకై సేకరించిన భూమిని సోమవారంనాడు మార్కాపురం నియోజకవర్గ ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రత్యేక అధికారి మరియు మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి శేషారెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల సంఖ్య మరియు సేకరించిన భూమి తదితర విషయాలను గురించి పలు వివరాలను మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావును అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.