మసీదు కమిటీ అక్రమాలపై విచారణ జరపాలి – ముస్లింలు
షాదిఖానాకు అద్దె ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా అధికారి
షాదిఖానాకు అద్దె ఇవ్వడంపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఝాన్సీ రాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే సాధారణ తనిఖీలో భాగంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఝాన్సీరాణి గురువారంనాడు పొదిలి ప్రభుత్వ వైద్యశాల వద్దగల షాదిఖానాను సందర్శించారు…. ఈ సందర్భంగా అందులో ఒక వ్యాపార సంస్థ ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారంలోగా సంబంధింత వ్యాపార సంస్థను ఖాళీ చేయాలని ఆదేశించారు.
విషయం తెలుసుకున్న స్థానిక ముస్లింలు అక్కడికి చేరుకుని చిన్న, పెద్ద మసీదుల కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని మరియు పీర్ల చావిడి స్థలానికి అద్దెలు వసూలు చేసుకుని సొంతానికి వాడుకుంటూ… కమిటీ కాలం పరిమితి ముగిసిన తర్వాత కూడా అక్రమంగా పని చేస్తున్నారని తెలుపగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేసి న్యాయం చేస్తానని మైనారిటీ అధికారిణి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య , ముస్లిం నాయకులు ముల్లా ఖుద్దుస్ , షేక్ సులేమాన్, మహాబుబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.