ఉగాది నాటికి 2020డియస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం : మంత్రి సురేష్
ఉగాది నాటికి ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా హాజరైన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించి ఉగాది నాటికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నా