పొదిలమ్మను దర్శించుకున్న కుందూరు పలు సమస్యలను దృష్టికి తీసుకుని వచ్చిన స్థానికులు
పొదిలి గ్రామ దేవత పొదిలిమ్మను స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి దర్శించుకున్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సోమవారంనాడు పొదిలి పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన అనంతరం స్థానిక పొదిలమ్మ నగర్ చేరుకుని గుడికి వెళ్ళే దారిలో సిమెంట్ నిర్మాణం పనులను పరిశీలించారు.
గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని….. మాకు ఇక్కడే నివాస స్థలాలను కేటాయించాలని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి స్థానికులు కోరగా పొదిలమ్మ దేవస్థాన భూమిని సర్వే చేయించి తదుపరి దేవస్థానము ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానము జూనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్, వైసిపి యువజన విభాగం నాయకులు మందగిరి రమేష్ యాదవ్, అనుకు నిహాంత్ యాదవ్ , వెలుగోలు కాశీ, గ్రామ వాలెంటీర్లు తదితరులు పాల్గొన్నారు.