ఉత్తమ పంచాయతీ కార్యదర్శి పద్మకు ఘన సత్కారం
మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ దంపతులకు సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే జనవరి 26గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని
జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్న సందర్భంగా స్థానిక మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీ సచివాలయం నందు సచివాలయ సిబ్బంది అభినందిస్తూ పద్మ దంపతులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ కార్యదర్శిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అలాగే గ్రామ పంచాయతీని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తున్నందుకు గాను జిల్లాలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శి పురస్కారాన్ని అందుకోవడం ఎంతో శుభసూచికం అని…… ఇదే విధంగా పనిచేసి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.