మహిళా వాలంటీర్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు
మహిళా వాలంటీర్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పొదిలి యస్ఐ సురేష్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని పియన్ఆర్ కాలనీలో తనకు కేటాయించిన ఇంటి నివేశన స్థలానికి సంబంధించి గ్రామ వాలంటీర్ గా వ్యవహరిస్తున్న బుడంగుంట్ల వెంకట మల్లేశ్వరి దగ్గరకు గత శనివారంనాడు మచ్చా రమణయ్య అనే వ్యక్తి వెళ్లి వికలాంగునికి ఇంటి నివేశన స్థలం దరఖాస్తు పెట్టాలని కోరగా…….
అతనికి ప్రభుత్వం ఇటీవల ఇంటి స్థలం కేటాయించి ప్రభుత్వ గృహ నిర్మాణం పనులు జరుగుతున్నాయని కాబట్టి నేను దరఖాస్తు పెట్టలేనని వాలంటీర్ బదులిచ్చినా కూడా వినకుండా పలుమార్లు నా విధులను ఆటంకపరిచి నన్ను ఇబ్బందులకు గురిచేస్తుండడంతోపాటు తన సొంత పనిపై మర్రిపూడి గ్యాస్ గోడౌన్ కు వెళ్లగా అక్కడ ఆమెకు తెలియకుండా ఫిలిప్ అనే వ్యక్తి వీడియో తీసి వాట్సాప్ లో పెట్టారని పొదిలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో…… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.