లారీ ట్రాక్టర్ ఢీ…. తప్పిన పెనుప్రమాదం
లారీ ట్రాక్టర్ ఢీకొని పక్కనే ఉన్న విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న సంఘటన స్థానిక పొదిలి సెంటినరి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వద్ద గురువారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని సెంటినరి తెలుగు బాప్టిస్టు చర్చ్ వద్ద లారీ, వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొని పక్కనే ఉన్న 11కెవి విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్నాయి…. ప్రమాదంలో వాహనాలు డ్రైవర్లు సురక్షితంగా బయటపడగా….. ఇనుప స్థంభం కావడంతో దృఢంగా ఉండడం వాహనాలు ఢీకొన్న ధాటికి విద్యుత్తు ప్రసారం ఆగిపోవడంతో పెనుప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.